బాక్సాఫీస్ వద్ద ఆగని “పఠాన్” విధ్వంసం

Published on Mar 7, 2023 11:00 pm IST


కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా అదే దూకుడు ను కొనసాగిస్తోంది. ఈ చిత్రం మరో 75 లక్షల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం హిందీ లో ఇప్పటి వరకూ 517 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ దూకుడు ఇప్పుడప్పుడే ఆగేలా లేదు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో దీపికా పదుకునే షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటించి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :