షారుఖ్ “పఠాన్” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

Published on Mar 8, 2023 6:53 pm IST


బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. ఈ చిత్రం లో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదలై బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇంకా మంచి వసూళ్లను రాబడుతోంది.

నిన్న మరో 1.25 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో 518 కోట్ల రూపాయలకి పైగా హిందీ లో వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో మరో 18 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం కి బాలీవుడ్ ఆడియెన్స్ నీరాజనం పలుకుతున్నారు. లాంగ్ రన్ లో మరో 10 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :