మరింత దూసుకెళ్తున్న షారుఖ్ “పఠాన్”

Published on Mar 6, 2023 7:27 pm IST


బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. ఈ చిత్రం విడుదలై ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే విధంగా జోరును కొనసాగిస్తోంది. ఆదివారం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం నిన్న 2.5 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం 516 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగు మరియు తమిళ భాషల్లో 18 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, మొత్తంగా 534 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రం దూకుడు ఇప్పుడు అప్పుడే ఆగేలా లేదు. మరో బిగ్ మూవీ థియేటర్ల లోకి వచ్చే వరకు షారుఖ్ కి తిరుగు లేదు. ఈ చిత్రం లో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం :