బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న “పఠాన్” జోరు

Published on Mar 18, 2023 1:07 am IST


కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ రూపంలో ఈ ఏడాది బాలీవుడ్‌కు మంచి ఆరంభం లభించింది. ఈ చిత్రం హిందీ చిత్రసీమలో ఇప్పటికే ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త నంబర్ వన్‌గా నిలిచింది. నాలుగేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న షారుఖ్ ఈ చిత్రం తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇప్ప‌టికే ఏడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది.

కొత్త విడుదలలు ఉన్నప్పటికీ, ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికీ మంచి వసూళ్ళను రాబడుతోంది. ప్రతి వీకెండ్ లో మంచి వసూళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం హిందీలో 522.40 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీపికా పదుకొణె కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం విలన్‌గా నటించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :