షారుఖ్ “పఠాన్” టార్గెట్ బహుబలి2?

షారుఖ్ “పఠాన్” టార్గెట్ బహుబలి2?

Published on Jan 29, 2023 11:00 PM IST

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ కి పూర్వ వైభవం తీసుకు వచ్చాడు. ఇప్పటి వరకు 429 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. అయితే వరల్డ్ వైడ్ గా వస్తున్న కలెక్షన్స్ కంటే కూడా బాలీవుడ్ హిందీ భాషలో వస్తున్న కలెక్షన్ల పై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.

బాలీవుడ్ లో సైతం సౌత్ చిత్రాలు టాప్ 2 లో కొనసాగుతున్నాయి. బాహుబలి 2 చిత్రం 510 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టి, టాప్ ప్లేస్ లో ఉండగా, కేజీఎఫ్2 చిత్రం 435 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టి, సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ చిత్రం లాంగ్ రన్ లో కేజీఎఫ్ ను బ్రేక్ చేసి, బాహుబలి 2 కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. చూస్తుంటే బాహుబలి2 ను పఠాన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో దీపికా పదుకునే, జాన్ అబ్రహం లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు