“చిరు 154” లో జాయిన్ అయ్యిన శృతి హాసన్..!

Published on Jul 9, 2022 11:04 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాల్లో రీమేక్ సినిమాలతో పాటుగా కొన్ని డైరెక్ట్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు కె ఎస్ రవీంద్ర (బాబీ) తో ప్లాన్ చేసిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ కూడా ఒకటి. ఇది మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా తెరకెక్కుతుండగా ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ ఎంపిక అయ్యిన సంగతి తెలిసిందే.

మరి ఈమె ఈరోజు నుంచి ఈ సినిమా సెట్స్ లో అడుగుపెడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ కూడా పాల్గొననుండగా ఇద్దరిపై సీన్ లు తెరకెక్కనున్నాయని టాక్. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :