సినిమా పరిశ్రమపై శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ….!

Published on Aug 10, 2022 8:00 pm IST

టాలీవుడ్ లో లేటెస్ట్ గా వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు స్టార్ నటి శృతి హాసన్. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ తీస్తున్న మూవీతో పాటు గోపీచంద్ మలినేనితో బాలయ్య హీరోగా నటిస్తున్న మూవీ కూడా చేస్తున్నారు. మరోవైపు తరచూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తరచు ఫ్యాన్స్, ఆడియన్స్ తో టచ్ లో ఉంటూ పలు విషయాలు షేర్ చేసుకునే శృతి హాసన్ లేటెస్ట్ గా ఒక ప్రోగ్రాంలో భాగంగా సినిమా పరిశ్రమ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

ఇది పురుషాధిక్య ఇండస్ట్రీ అని, నటులకు సమానంగా నటీమణులకు ఇక్కడ సరైన గుర్తింపు, పారితోషికం లేదని గతంలో పలువురు నటీమణులు తమ అభిప్రాయాలు వెల్లడించారు, దీనిపై మీరేమంటారు అంటూ ఒక ప్రోగ్రాం లో భాగంగా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకి శృతి ఈ విధంగా బదులిచ్చారు. సమాజం మొత్తం అలానే ఉన్నందున సినిమా పరిశ్రమను మాత్రమే పురుషాధిక్యతగా చూపడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాటికి ప్రతిబింబం మాత్రమేనని, అందువలన సినీ పరిశ్రమను మాత్రమే నిందించడంలో అర్థం లేదని ఆమె అన్నారు.

సంబంధిత సమాచారం :