చాలా కాలం తర్వాత ధియేటర్ లో సినిమాను బాగా ఎంజాయ్ చేశాను – రాజమౌళి!

Published on May 29, 2023 6:20 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో తన తదుపరి చిత్రం ను ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఈలోపు డైరెక్టర్ రాజమౌళి ఒక సినిమాను ధియేటర్ లో చూశారు. ఆ చిత్రం పై సోషల్ మీడియా వేదిక గా ప్రశంసల వర్షం కురిపించారు.

చాలా కాలం తర్వాత ధియేటర్ లో ఓ సినిమాను బాగా ఎంజాయ్ చేశాను అంటూ మేమ్ ఫేమస్ సినిమా గురించి తెలిపారు. సుమంత్ కోసం చూడండి అంటూ చెప్పుకొచ్చారు. నటుడు గా, దర్శకుడు గా అతనికి మంచి భవిష్యత్ ఉంది. సినిమాలో అన్ని పాత్రలు చాలా చక్కగా డిజైన్ చేసినట్లు తెలిపారు రాజమౌళి. అందరికీ రికమెండ్ చేస్తున్నట్లు తెలిపారు. యూత్ ను ఎంకరేజ్ చేయాలి, ధమ్ ధమ్ చేయకూడదు అని అన్నారు. రాజమౌళి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :