మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, జవాన్‌ చిత్రాలపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Sep 8, 2023 8:09 pm IST

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మరియు జవాన్ చిత్రాలు రెండు నిన్న థియేటర్ల లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలు కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఈ రెండు చిత్రాలను దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి చూశారు. సినిమాల పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముందుగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం పై కామెంట్స్ చేసారు. అనుష్క ఎప్పటిలాగే అందంగా ఉందని, నవీన్ పోలిశెట్టి ఎంతగానో నవ్వించారు అని ప్రశంసించారు. ఇంకా, దర్శకుడు మహేష్ బాబు పి సహా మొత్తం టీమ్‌కి రాజమౌళి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జవాన్ గురించి మాట్లాడుతూ, షారూఖ్ ఖాన్‌ను బాక్సాఫీస్ బాద్‌షా అని సంబోధించాడు. జవాన్ మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది అని, అద్భుతమైన విజయం సాధించినందుకు జవాన్ టీమ్‌ను కంగ్రాట్స్ అని అన్నారు.

సంబంధిత సమాచారం :