తెలుగు ఇండస్ట్రీ కి ఇంకో ఫెంటాస్టిక్ హీరో వచ్చాడు – రాజమౌళి

Published on Oct 29, 2021 7:54 pm IST


రొమాంటిక్ సినిమా నేటి నుండి థియేటర్ల లో సందడి చేయనుంది. ఈ సినిమా చూసిన సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమా పై, హీరో పై పొగడ్తల వర్షం కురిపించారు. తెలుగు ఇండస్ట్రీ కి ఇంకో ఫెంటాస్టిక్ హీరో వచ్చాడు, యంగ్స్టర్స్ కి ఈ సినిమా పండగే అని అన్నారు. లవ్ స్టోరీ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి అని, మీరు పెట్టే డబ్బుకు సినిమా తగినదే అని అన్నారు.

ఆకాష్ వన్ మ్యాన్ షో, ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటెన్స్ అండ్ రొమాంటిక్ జగన్ గారి డైలాగ్స్ బ్లాస్ట్. కుర్రాళ్ళు టికెట్స్ బుక్ చేసుకొని సినిమాకు వెళ్ళిపొండి అంటూ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. అదే విధంగా గుణ శేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ డైలాగ్స్ హీరో లందరూ చెప్తుంటే విని మనం ఎంజాయ్ చేశాం, ఇప్పుడు ఆకాష్ వాళ్ళ నాన్న డైలాగ్స్ చెప్తుంటే చాలా బాగుంది, సినిమా చాలా గ్రిప్పింగ్ గా ఉంది అని అన్నారు.

పూరి గారి అబ్బాయి హీరో అవ్వడం వలన ఆయనలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందని తెలిసింది, అతని నటన బావుంది అని, పూరి సర్ హీరోయిజం బావుంది అని డైరక్టర్ మోహన్ రాజ అన్నారు. దేశాన్ని ప్రేమిస్తే రూపాయి ఖర్చు అవ్వదు, ఆడదాన్ని ప్రేమిస్తే దూల తీరిపొద్ది, ఇలాంటివి రాయాలంటే పూరి సర్ అంటూ డైరక్టర్ హరీశ్ శంకర్ అన్నారు. అంతేకాక సినిమా లో నటించిన నటీనటుల పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాక సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు సినిమా చూసిన అనంతరం ప్రశంసల వర్షం కురిపించారు.

సంబంధిత సమాచారం :

More