ఆర్ ఆర్ ఆర్ గ్లింప్స్ రెస్పాన్స్ పై రాజమౌళి కీలక వ్యాఖ్యలు!

Published on Nov 2, 2021 2:00 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఇద్దరూ ఈ చిత్రం లో కొమురం భీమ్ పాత్రలో, అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాట విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి చిత్ర యూనిట్ గ్లింప్స్ ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ గ్లింప్స్ భారీ వ్యూస్ ను కొల్లగొట్టింది. టాలీవుడ్ లో సినీ ప్రముఖులు, అభిమానుల, ప్రేక్షకులు ఈ గ్లింప్స్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులో ఈ గ్లింప్స్ కి 12 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా, 987.7 కే లైక్స్ రావడం విశేషం. ఈ గ్లింప్స్ వస్తున్న భారీ రెస్పాన్స్ పై రాజమౌళి స్పందించడం జరిగింది.

ఆర్ ఆర్ ఆర్ మూవీ గ్లింప్స్ కి భారీ రెస్పాన్స్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రాజమౌళి. సినీ పరిశ్రమ లోని స్నేహితులు, అభిమానులు పంపిన సందేశాలు, అభినందనలకు ధన్యవాదాలు అని అన్నారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More