లేటెస్ట్ : ‘ఛత్రపతి’ టీమ్ కి జక్కన్న బెస్ట్ విషెస్

Published on May 10, 2023 3:33 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో 2005లో జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన మూవీ ఛత్రపతి. శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో భానుప్రియ, షఫీ, శేఖర్, అజయ్, ప్రదీప్ రావత్ తదితరులు కీలక పాత్రలు చేసారు. అప్పట్లో అతి పెద్ద విజయం అందుకున్న ఈ మూవీని ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ హిందీలో తెరకెక్కించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ డెబ్యూ మూవీగా రూపొందిన ఛత్రపతి నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని ఆకట్టుకుని నార్త్ ఆడియన్స్ లో మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. మే 12న గ్రాండ్ గా ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక తాజాగా ఛత్రపతి టీమ్ కి జక్కన్న బెస్ట్ విషెస్ తెలియచేసారు.

తన కెరీర్ లో నిలిచిపోయే బెస్ట్ మూవీస్ లో ఛత్రపతి ఒకటని అన్నారు రాజమౌళి. ఇక ప్రస్తుతం ఛత్రపతి హిందీ రీమేక్ మూవీలో నటించిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి డైరెక్టర్ వివి వినాయక్ తో పాటు నిర్మించిన పెన్ ఇండియా లిమిటెడ్ అధినేత జయంతి లాల్ గడ కి మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఒక వీడియో బైట్ ద్వారా బెస్ట్ విషెస్ తెలిపారు రాజమౌళి.

సంబంధిత సమాచారం :