ఓటేసేందుకు దుబాయ్ నుండి డైరెక్ట్ గా పోలింగ్ బూత్ కి వచ్చిన జక్కన్న!

ఓటేసేందుకు దుబాయ్ నుండి డైరెక్ట్ గా పోలింగ్ బూత్ కి వచ్చిన జక్కన్న!

Published on May 13, 2024 10:02 AM IST

తన చిత్రాలతో భారతీయ సినీ పరిశ్రమకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి. దుబాయ్ లో ఉన్న ఎస్ ఎస్ రాజమౌళి ఓటు వేసేందుకు డైరెక్ట్ గా విమానాశ్రయం నుండి పోలింగ్ బూత్ కి వెళ్లారు. అలా అలిసిపోయిన లుక్స్ తో ఉండి, ఓటు వేసినట్లు పేర్కొన్నారు. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నారా అంటూ చెప్పుకొచ్చారు. తను ఓటు వేసిన విషయాన్ని వెల్లడించడానికి ఫోటోను షేర్ చేశారు. సిరా ఉన్నటువంటి వేలిని చూపిస్తున్న రమా రాజమౌళి, జక్కన్న లను ఫొటోలో చూడవచ్చు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో జక్కన్న SSMB29 వ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రం ను జక్కన్న హాలీవుడ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు