అంగరంగ వైభవంగా బాలకృష్ణ సినిమా ప్రారంభోత్సవం !


నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ఈరోజు కూకట్ పల్లిలో పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. సీనియర్ దర్శకులైన ఎస్వీ కృష్ణా రెడ్డి, కోందండరామి రెడ్డిలతో పాటు బోయపాటి శ్రీను, క్రిష్ లు కార్యక్రమానికి హాజరు కాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాలకృష్ణ పై క్లాప్ ఇచ్చి సినిమాని ప్రారంబించారు.

100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత బాలకృష్ణ చేస్తున్న చిత్రం, కావడం ఎవరూ ఊహించని విధంగా పూరి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచానాలున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు, ఇతర నటీనటులెవరు, సినిమా కథ ఎలా ఉండబోతోంది అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ వచ్చే వారం నుండి మొదలుకానుండగా సెప్టెంబర్ 29న సినిమాని రిలీజ్ చేయనున్నారు.