లేటెస్ట్ : రాజమౌళి తో స్టీవెన్ స్పీల్ బర్గ్ ఇంట్రస్టింగ్ లైవ్ వీడియో

Published on Feb 10, 2023 10:30 pm IST

దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన అతి పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. గత ఏడాది మార్చి లో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ భారీ సక్సెస్ ని సొంతం చేసుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులని సైతం దక్కించుకుంటూ దూసుకెళుతోంది. ఇక ఇండియానా జోన్స్, జురాసిక్ పార్క్, ది అడ్వెంచర్స్ ఆఫ్ టిన్ టిన్ వంటి భారీ సినిమాలని తెరకెక్కించిన స్టీవెన్ స్పీల్ బర్గ్, ఆర్ఆర్ఆర్ మూవీ డైరెక్టర్ రాజమౌళి పై ప్రసంశలు కురిపించిన సంగతి తెలిసిందే.

అయితే లేటెస్ట్ గా వీరిద్దరూ కలిసి ఒక వీడియో లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పీల్ బర్గ్ లేటెస్ట్ గా తెరకెక్కించిన ది ఫాబెల్ మాన్స్ సినిమాకి సంబంధించి జరిగిన ఈ లైవ్ లో మరొక్కసారి రాజమౌళిని మరింతగా ప్రసంశించారు. ఇక వీరిద్దరి వీడియో లైవ్ ని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఇందులో మీ మూవీ అద్బుతంగా ఉందని, నేను ఎంతో ఎంజాయ్ చేశానని రాజమౌళితో స్పీల్ బర్గ్ చెప్తున్న మాటలు గమనించవచ్చు. అయితే ఆ మాటలు విన్న రాజమౌళి, ఒక్కసారి నాకు ఇపుడు ఈ వీడియో ఆపేసి ప్రక్కకు వెళ్లి డ్యాన్స్ చేయాలనిపిస్తోంది అని అంటారు. కాగా ఈ ఇద్దరు దిగ్గజ దర్శకుల సంభాషణ తాలూకు ఫుల్ వీడియో ప్రముఖ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది.

సంబంధిత సమాచారం :