ట్రెండింగ్ : ఫ్రాన్స్ లోని 3డి యానిమేషన్ స్టూడియో విజిట్ చేసిన రాజమౌళి ….అందుకోసమేనా …??

Published on Jun 28, 2022 10:00 pm IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క అపజయం కూడా ఎరుగని దర్శకధీరుడిగా తిరుగులేని ఇమేజ్ తో కొనసాగుతున్నారు. ఇటీవల అంతకముందు ఈగ, ఆ తరువాత బాహుబలి సిరీస్ సినిమాలు, కొన్నాళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ ఇలా వరుసగా తన సినిమాలతో టాలీవుడ్ ఖ్యాతిని అమాంతంగా హాలీవుడ్ కి రేంజ్ కి తీసుకెళ్లారు జక్కన్న. ఇక త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో అతి పెద్ద పాన్ ఇండియా మూవీ తీయనున్న రాజమౌళి, నేడు ఫ్రాన్స్ లోని ప్రముఖ 3డి యానిమేషన్ స్టూడియో యూనిట్ ఇమేజ్ ని నిర్మాత శోభు యార్లగడ్డ, గ్రాఫిక్ డిజైనర్ కమల్ కన్నన్ లతో కలిసి వెళ్లి సందర్శించారు. అనంతరం అక్కడి కో ఫౌండర్స్ తో కొద్దిసేపు కొన్ని విషయాలపై సందేహాలు అడిగి తెలుసుకున్నారు.

యూనిట్ ఇమేజ్ సంస్థ సభ్యులతో కలిసి పలు సందేహాలు నివృత్తి చేసుకున్నానని, రాబోయే రోజుల్లో వారితో కలిసి పని చేసే అవకాశం లేకపోలేదని రాజమౌళి కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వారితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. కాగా రాజమౌళి, మహేష్ మూవీ కోసమే వారిని కలిసారని, ఆ మూవీని పాన్ ఇండియా రేంజ్ ని మించి పాన్ వరల్డ్ లెవెల్లో తీసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక మూవీ గురించి పూర్తి వివరాలు తెలియాలి అంటే మరికొన్ని నెలలు ఓపికపట్టక తప్పేలా లేదు.

సంబంధిత సమాచారం :