“బ్రహ్మాస్త్ర” ఫస్ట్ సాంగ్ గ్లింప్స్‌ ని రిలీజ్ చేసిన రాజమౌళి

Published on May 27, 2022 3:00 pm IST

ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ మూవీలో యంగ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ మరియు అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు.

తాజా వార్త ఏమిటంటే, RRR దర్శకుడు SS రాజమౌళి ఈ చిత్రం యొక్క మొదటి పాట కుంకుమల వీడియో గ్లింప్స్ ను విడుదల చేసారు. ప్రీతమ్ స్వరపరచగా, సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట చాలా బాగుంది. చంద్రబోస్ లిరిక్స్ రాశారు. టాలీవుడ్ నటుడు నాగార్జున, అమితాబ్ బచ్చన్ మరియు మౌని రాయ్ లు నటిస్తున్న ఈ బహుభాషా బిగ్గీ సెప్టెంబర్ 9, 2022 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :