మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కోసం అందరికీ తెలిసిందే. మరి రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, RRR చిత్రాలు గ్లోబల్ లెవెల్లోకి తెలుగు సినిమాని తీసుకెళ్లేలా తాను చేశారు. అయితే పాన్ ఇండియా మార్కెట్ లో బాహుబలి కొత్త ఒరవడి సృష్టిస్తే దానికంటే ముందే ఓ సినిమాని తాను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలని చాలా ప్రయత్నం చేసానని చెప్పిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.
మరి ఆ చిత్రమే “మగధీర”. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు సినిమా దగ్గర కనీ వినీ ఎరుగని వసూళ్లతో రికార్డులు తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం అని అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో డబ్ చేద్దామని తన నిర్మాత అల్లు అరవింద్ ని చాలా కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించాను అని తాను చెప్పిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.
తన పాన్ ఇండియా ఆలోచనలు బాహుబలి నుంచి వచ్చింది కాదు మగధీర టైం లోనే ఇతర భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేద్దామని నా నిర్మాతని అడిగాను, అర్ధించాను కూడా కానీ ఎందుకో ఆయన అందుకు ఒప్పుకోలేదు అంటూ ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో జక్కన్న చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. మరి అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అలా ఆగిపోవాల్సి వచ్చింది.