సూర్యవంశీ ఘన విజయం సాధించాలి – ఎస్ ఎస్ రాజమౌళి

Published on Nov 3, 2021 2:00 pm IST

అక్షయ్ కుమార్, రన్ వీర్ సింగ్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూర్యవంశీ చిత్రం నవంబర్ 5 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం విడుదల అవుతుండటం తో చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఎస్ ఎస్ రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు.

సూర్య వంశీ చిత్రం ఘన విజయం సాధించాలి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న కష్ట సమయాల్లో థియేటర్ల లోనే విడుదల చేయాలని ఏడాదిన్నర కాలం ఆగిన చిత్ర యూనిట్ కి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో కొమురం భీమ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 7 వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :