విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకి సంబంధించి ట్వీట్ చేశారు. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే పనులో ఫుల్ బిజీగా ఉన్నామని.. అలాగే గత కొన్ని రోజులుగా ఈ చిత్రం యొక్క ఫైనల్ మిక్స్ జరుగుతుందని.. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని.. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి వరుస అప్ డేట్స్ వస్తాయని తమన్ ట్వీట్ చేశాడు.
ఇక ఈ సినిమాలో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చాలారోజుల నుండి ఊరిస్తూ వస్తున్న వెంకీ, చైతన్యల కాంబినేషన్ కావడంతో ‘వెంకీ మామ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.
