మహేష్ 28 లేటెస్ట్ షూట్ అప్ డేట్

Published on Mar 25, 2023 12:30 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ వారు SSMB 28 వర్కింగ్ టైటిల్ తో ఒక భారీ మూవీ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవకి థమన్ సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతి బాబు నెగటివ్ రోల్ లో కనిపించనుండగా ఇతర పాత్రల్లో హైపర్ ఆది, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ వంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, ఇప్పటికే పలు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ మూవీకి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ ని ఇటీవల భారీగా వేసిన ఇంటి సెట్ లో నైట్ టైం నిర్వహించనున్నారట. కీలక తారాగణం పాల్గొననున్న ఈ షెడ్యూల్ తరువాత మిగతా బ్యాలెన్స్ షూట్ ని కూడా వేగవంతంగా పూర్తి చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ నుండి రానున్న శ్రీరామనవమి కి అప్ డేట్ రానుందని వార్తలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నప్పటికీ దీని పై యూనిట్ నుండి ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :