SSMB 28 : అన్నిటి పై పక్కాగా క్లారిటీ వచ్చేది ఆరోజునే ?

Published on Mar 15, 2023 3:00 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ పై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి పని చేసిన అతడు, ఖలేజా సినిమాలు రెండూ కూడా ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాయి. సూర్యదేవర రాధాకృష్ణ, తన హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క టైటిల్ కి సంబంధించి ప్రస్తుతం పలు టైటిల్స్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. ముందుగా ఈ మూవీకి అతడే పార్ధు, అర్జునుడు వంటి టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు రాగా, తాజాగా దీనికి అమ్మ కథ అనే సాఫ్ట్ టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే పక్కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ కథనాల్లో ఏది వాస్తవమో, ఫైనల్ గా SSMB 28 మూవీ కి టైటిల్ ఏది ఫిక్స్ చేస్తారు అనేది తెలియాలి అంటే రానున్న ఉగాది వరకు ఆగాల్సిందే అని, ఆరోజున ఈ మూవీ యొక్క టైటిల్ అనౌన్స్ మెంట్ ఉండనుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :