SSMB 29 : ఆ న్యూస్ వాస్తవం కాదట

Published on Sep 27, 2023 9:30 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన కెరీర్ 28వ మూవీ గుంటూరు కారం లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈమూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రానున్న సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది.

అయితే దాని అనంతరం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 వర్కింగ్ టైటిల్ తో ఒక భారీ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే తన కెరీర్ 29వ మూవీని యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో సూపర్ స్టార్ మహేష్ చేయనున్నారని అలానే దీనిని అనిల్ సుంకర నిర్మించనున్నారని నిన్నటి నుండి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆ న్యూస్ ఏమాత్రం వాస్తవం కాదట. ముందుగా కమిట్ అయిన ప్రకారం SSMB 29 మూవీని పక్కాగా రాజమౌళి తోనే చేయనున్నారట మహేష్ బాబు. ఆ తరువాతనే మిగతా దర్శకులతో ఆయన మూవీస్ చేయనున్నారని తెలుస్తోంది. కాగా ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఏడాది ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :