“SSMB28” టైటిల్ రివీల్ కి సర్వం సిద్ధం!

“SSMB28” టైటిల్ రివీల్ కి సర్వం సిద్ధం!

Published on May 26, 2023 4:00 PM IST


టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి SSMB28 అనే టైటిల్ తాత్కాలిక టైటిల్ ను పెట్టడం జరిగింది. మేకర్స్ నేడు ఈ చిత్రం కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను రిలీజ్ చేయడం జరిగింది.

ఈ చిత్రం కి సంబంధించిన టైటిల్ ను మే 31 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. బిగ్ స్క్రీన్స్ పై సూపర్ ఫ్యాన్స్ టైటిల్ రివీల్ ఉంటుంది అని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఈ పోస్టర్ ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది. పూజా హెగ్డే, శ్రీ లీల లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు