SSMB 28 : నాన్ స్టాప్ షెడ్యూల్ లో పాల్గొననున్న సూపర్ స్టార్ మహేష్ ?

SSMB 28 : నాన్ స్టాప్ షెడ్యూల్ లో పాల్గొననున్న సూపర్ స్టార్ మహేష్ ?

Published on Dec 22, 2022 3:05 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా SSMB 28 పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా మూవీస్ కల్ట్ క్లాసిక్స్ గా నిలిచి ఇప్పటికీ కూడా టివి ఛానల్స్ లో ప్రసారమైతే మంచి రేటింగ్స్ అందుకుంటూ ఉంటాయి. ఇక దాదాపుగా పన్నెండేళ్ల విరామం తరువాత మహేష్ తో చేస్తున్న మూవీ కావడంతో త్రివిక్రమ్ కూడా SSMB 28 స్టోరీ, స్క్రీన్ ప్లే విషయమై పక్కాగా కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ని పక్కాగా జనవరి రెండవ వారం నుండి ప్రారంభించి మార్చి నెలాఖరు వరకు దాదాపుగా 60 రోజుల పాటు నాన్ స్టాప్ గా జరిపేందుకు యూనిట్ ప్రణాళిక సిద్ధం చేసిందట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాత సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ వారు దీనిని గ్రాండ్ లెవెల్లో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు