SSMB28 : అంతా రెడీ …. రెగ్యులర్ షూట్ ముహూర్తం ఫిక్స్…. ?

SSMB28 : అంతా రెడీ …. రెగ్యులర్ షూట్ ముహూర్తం ఫిక్స్…. ?

Published on Jul 7, 2022 10:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దాదాపుగా పన్నెండేళ్ల విరామం తరువాత మహేష్, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనుండగా యువ సంగీత దర్శకుడు ఎస్ థమన్ స్వరాలు సమకూర్చనున్నారు.

ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ స్టోరీ, స్క్రిప్ట్ ఫైనల్ నారేషన్ మహేష్ బాబు కి వినిపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనిని అద్భుతంగా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని అంటోంది యూనిట్. ఇక ఈ భారీ మూవీ రెగ్యులర్ షూట్ ని ఆగష్టు మొదటి వారంలో ప్రారంభించేందుకు యూనిట్ రెడీ అయిందట. మహేష్ ఒక స్టైలిష్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీకి మది కెమెరా మ్యాన్ గా వ్యవహరించనున్నారు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు