నాన్ స్టాప్ గా మహేష్ 28 షూటింగ్ ప్లాన్స్ ?

Published on May 19, 2023 3:11 am IST

సూపర్ స్టార్ మహేష్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న SSMB 28 మూవీ పై సూపర్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా గ్రాండ్ లెవెల్లో అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు మాస్ యాక్షన్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీని ఫ్యామిలి యాక్షన్ తో కూడిన పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, హైపర్ ఆది వంటి వారు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీలో జగపతి బాబు విలన్ గా కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ ని హారికా హాసిని క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

కాగా మ్యాటర్ ఏమిటంటే, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరుపుకున్న SSMB 28 నుండి టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ ని మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా రిలీజ్ చేయనుండగా మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ని జూన్ 7 నుండి నాన్ స్టాప్ గా కొన్నాళ్లపాటు కొనసాగించేలా ప్లాన్ చేశారట. దానితో మేజర్ షూట్ మొత్తం కంప్లీట్ చేయాలనేది యూనిట్ ప్రణాళిక అని అంటున్నారు. అలానే ముందుగానే ప్రకటించిన విధంగా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఎట్టిపరిస్థితుల్లో తమ మూవీని థియేటర్స్ లోకి తీసుకువస్తాం అని మేకర్స్ చెప్తున్నారు.

సంబంధిత సమాచారం :