SSMB28: అద్దిరిపోయే ఫస్ట్ లుక్ తో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన టీమ్

SSMB28: అద్దిరిపోయే ఫస్ట్ లుక్ తో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన టీమ్

Published on Mar 26, 2023 6:45 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం SSMB28. ఈ చిత్రం కి ఇంకా టైటిల్ ను ఖరారు చేయాల్సి ఉంది. అయితే మేకర్స్ తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సిగరెట్ తాగుతూ, స్టైల్ గా నడుస్తున్న ఫోటో తో పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ సూపర్ గా ఉంది. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో దింపేందుకు సిద్దం అయ్యారు.

ఈ చిత్రాన్ని జనవరి 13, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేయనున్నారు మేకర్స్. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ కొద్ది సేపటికే వైరల్ గా మారుతోంది. పూజా హెగ్డే, శ్రీ లీల లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు