SSMB 28 నా డ్రీం కాంబో – మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్

Published on Feb 3, 2023 2:00 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు తో ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక భారీ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. SSMB 28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇక ఇటీవల ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ, సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వర్క్ చేయాలనేది తన డ్రీమ్ అని చెప్పారు. అతడు, ఖలేజా మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ వద్ద తాను వర్క్ చేశానని, ఇక వారిద్దరి కలయికలో సినిమా ఛాన్స్ కోసం తాను ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూశానని అన్నారు. అయితే ఫైనల్ గా SSMB 28 డ్రీం కాంబో కోసం పనిచేసే ఛాన్స్ తనకు రావడంతో పట్టరాని ఆనందం కలిగిందని, తప్పకుండా అందరూ ఆశిస్తున్నట్లుగా ఈ మూవీ సాంగ్స్, బీజీఎమ్ ఎంతో గ్రాండ్ గా అదిరిపోయేలా సిద్ధం చేస్తున్నాం అని తెలిపారు.

సంబంధిత సమాచారం :