SSMB 30 : సస్పెన్స్ వీడాలంటే అప్పటివరకు ఆగాల్సిందేనా … ??

SSMB 30 : సస్పెన్స్ వీడాలంటే అప్పటివరకు ఆగాల్సిందేనా … ??

Published on Jun 25, 2022 1:30 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మవీతో కెరీర్ పరంగా సెకండ్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నెక్స్ట్ మూవీ చేయనున్నారు మహేష్. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఎంతో భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

అయితే దీని తరువాత జక్కన్న రాజమౌళితో తొలిసారిగా భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు మహేష్. మ్యాటర్ ఏమిటంటే, రాజమౌళి మూవీ అనంతరం మహేష్ నటించబోయే కెరీర్ 30వ సినిమా కూడా ఆల్రెడీ ఫిక్స్ అయినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మహేష్ తన 30వ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సుకుమార్ లేదా కొరటాల శివ లలో ఒకరు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే పక్కాగా వీరిద్దరిలో ఎవరిని ఆ ఛాన్స్ వరించింది అనేది తెలియాలి అంటే మాత్రం మరొక మూడేళ్ళ వరకు ఆగాల్సిందే అంటున్నారు. కాగా మహేష్ ఫ్యాన్స్ మాత్రం వారిద్దరిలో ఎవరైనా సరే తమ సూపర్ స్టార్ కి తప్పకుండా సూపర్ హిట్ ఇస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు