“స్టాండ్ అప్ రాహుల్” నుండి నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయనున్న స్టార్ హీరోయిన్

Published on Jan 17, 2022 8:18 pm IST

నూతన దర్శకుడు సంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్టాండ్ అప్ రాహుల్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇప్పటికే అలా ఇలా అనే పాటను విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు స్వీకర్ అగస్తి స్వరపరిచిన మరో పాటను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. ట్రావెల్ సాంగ్‌గా చెప్పబడుతున్న పదా, రేపు సాయంత్రం 04:59 గంటలకు పుష్ప నటి రష్మిక మందన్న చేతుల మీదుగా లాంచ్ కానుంది.

రెహ్మాన్ సాహిత్యం అందించగా, ప్రముఖ గాయకుడు యాజిన్ నిజర్ ఈ పాటను పాడారు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :