“స్టాండ్ అప్ రాహుల్” ప్రీ రిలీజ్ వేడుక కి హాజరు కానున్న వరుణ్

Published on Mar 16, 2022 11:30 am IST

రాజ్ తరుణ్ హీరోగా సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం స్టాండ్ అప్ రాహుల్. ఈ చిత్రం లో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా వర్ష బోల్లమ్మ నటిస్తుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హై ఫైవ్ పిక్చర్స్ పతాకంపై నంద్ కుమార్ అబ్బినేని మరియు భరత్ మగులూరి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం ను మార్చ్ 18 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. నేడు చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుక ను నిర్వహించనుంది. ఈ వేడుక కి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మురళి శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం స్వీకర్ అగస్తి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :