దర్శకుడిగా మారుతానంటున్న స్టార్ నటుడు !

18th, December 2017 - 10:20:38 AM

ఒకప్పుడు ‘బొంబాయి, రోజా’ వంటి సినిమాలతో హీరోగా అలరించి కాలానుగుణంగా మారి ప్రస్తుతం వయసుకు తగిన పాత్రలు చేస్తూ ప్రేక్షకాధారణ పొందుతున్న నటుడు అరవింద స్వామి. తమిళంలో ‘తనీ ఒరువన్’ తో, తెలుగులో ‘ధృవ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ ఆయిన ఆయన దర్శకత్వం చేసే ఆలోచన ఉందా అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు 2018 లో దర్శకత్వంలో చేసే ఆలోచన ఉంది అంటూ చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు అని అడగ్గానే ఊహించనిదే చేస్తానని అనుకోవచ్చు అంటూ సమాధానమిచ్చారు.