‘పుష్ప – 2’ షూట్ లో జాయిన్ అయిన స్టార్ యాక్టర్

Published on Mar 1, 2023 10:39 pm IST


అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ తీస్తున్న భారీ యాక్షన్ మాస్ మూవీ పుష్ప ది రూల్. పుష్ప ది రైజ్ మూవీ ఎంతో పెద్ద సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న పుష్ప 2 ని మరింత అద్భుతంగా ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క నేటి షూట్ లో స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ జాయిన్ అయ్యారు. పుష్ప 1 లో భన్వర్ సింగ్ షకావత్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్న ఫహాద్, పార్ట్ 2 లో అదే పాత్రలో మరింతగా అదరగొట్టనున్నారట. మొత్తంగా అందరిలో రోజురోజుకు ఎంతో ఆసక్తిని రేపుతోన్న పుష్ప 2 మూవీ కి సంబందించిన అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :