సమంత సినిమాలో నటించనున్న స్టార్ నటుడు !

స్టార్ హీరోయిన్ సమంత కన్నడలో సూపర్ హిట్ చిత్రం ‘యు టర్న్’ ను రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళంలో కూడా రీమేక్ కానున్న ఈ చిత్రంలో రెండు భాషల్లోనూ మంచి పేరున్న స్టార్ నటుడు ఆది పినిశెట్టి కూడా నటించనున్నారు. కథకు కీలకమైన పోలీసాఫీసర్ పాత్రలో ఆది కనిపించనున్నారు.

ఈ రెండు వెర్షన్లను కూడా ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ డైరెక్ట్ చేయనుండటం విశేషం. ఈ సూపర్ నేచ్యురల్ థ్రిల్లర్ యొక్క రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి నుండి మొదలుకానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ కూడా ఒక పాత్రలో నటించనుండగా మరొక రెండు పాత్రల కోసం శ్రియ, భూమికలు ప్రస్తావనలో ఉన్నారు.