డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన స్టార్ హీరో మూవీ!

Published on Feb 24, 2023 7:02 pm IST

స్టార్ యాక్టర్ మోహన్ లాల్ ప్రస్తుతం పలు ప్రాజెక్టుల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన అతని చివరి చిత్రం అలోన్ రిపబ్లిక్ డే రోజున థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ చిత్రం మార్చి 3, 2023న తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శించబడుతుందని ప్రకటించింది. అయితే, ఈ చిత్రం దాని డబ్బింగ్ వెర్షన్‌లను ప్రత్యేకంగా ప్లాట్‌ఫారమ్‌లో పొందుతుందా లేదా అనేది తెలియాలంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. మంజు వారియర్, అన్నీ షాజీ కైలాస్, సిద్ధిక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజేష్ జయరామన్ స్క్రిప్ట్ రాశారు. ఆశీర్వాద్ సినిమాస్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించింది.

సంబంధిత సమాచారం :