స్టార్ హీరోయిన్ ఆత్మహత్య వార్తలన్నీ పుకార్లే!

aishwarya-rai
ఇండియన్ సినిమాలో ఐశ్వర్య రాయ్‌కి ప్రేక్షకులిచ్చిన స్థానం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తల్లి అయ్యాక కూడా గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతున్నారామె. ఇక నిన్న సాయంత్రం నుంచి ఐశ్వర్య రాయ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. పలు స్థానిక మీడియా సంస్థలు సైతం ఈవార్తను ప్రసారం చేశాయి. కాగా ఇవన్నీ పుకార్లేనని చెబుతూ ఐశ్వర్య టీమ్ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు వచ్చినపుడు మీడియా సైతం ఆలోచించుకొని, అన్నీ తెలుసుకొని ప్రచురించాలని, ఐశ్వర్య రాయ్‌కి ఆత్మహత్య చేసుకునే అవసరం ఎందుకు ఉంటుంది? అంటూ ఆమె మీడియా పర్సన్స్ తీవ్రంగా స్పందించారు. ఈ మధ్యే ఏ దిల్ హై ముష్కిల్‌తో మంచి హిట్ కొట్టిన ఐశ్వర్య, ఇటు వ్యక్తిగత జీవిత పరంగానూ బచ్చన్ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారు.