చిరు సినిమాకు భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిన కాజల్?

kajal
మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడు మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా మొదలవుతుందా అని చాలాకాలంగా చూసిన ఎదురుచూపులకు తెరదించుతూ, కొద్దిరోజుల క్రితమే ఆయన తన సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక సినిమా సెట్స్‌పైకెళ్ళినా ఇందులో హీరోయిన్‌గా నటించేది ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఈ విషయమై చాలాపేర్లే వినిపిస్తున్నా ఇంకా ఎవ్వరూ ఫైనల్ కాలేదు.

తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్‌ను కూడా చిరుకు హీరోయిన్‌గా సంప్రదించారట. అయితే ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఏకంగా 2.5కోట్లకు పైనే పారితోషికం డిమాండ్ చేశారట. కాజల్ తన కెరీర్‌లో ఇంత మొత్తం ఎప్పుడూ డిమాండ్ చేయలేదని తెలుస్తోంది. ఇక ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడం ఇష్టం లేని నిర్మాతలు కాజల్‌ను కాకుండా వేరొక హీరోయిన్‌ను సంప్రదిస్తున్నారని సమాచారం. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.