‘జాగ్వార్‌’లో శృతి హాసన్ స్పెషల్ సాంగ్?

sruthihasan
మాజీ ప్రధాని దేవేగౌడ మనువడు నిఖిల్ గౌడ హీరోగా పరిచయం అవుతూ తెలుగు, కన్నడ భాషల్లో ‘జాగ్వార్’ అనే ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. సుమారు 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకకు పవన్ హాజరు కానున్నారన్న విషయం కొద్దిరోజులుగా సినిమాకు క్రేజ్ తీసుకొస్తూ ఉండగా, తాజాగా మరో వార్త ఈ క్రేజ్‍ను మరింత పెంచేస్తోంది. అదే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వినిపిస్తోన్న వార్త.

‘జాగ్వార్’ సినిమాలో భారీ ఎత్తున ప్లాన్ చేసిన స్పెషల్ సాంగ్‌లో నటించమని కోరుతూ, టీమ్, శృతి హాసన్‌ను కలిసిందట. అయితే ఈ విషయమై శృతి హాసన్ స్పష్టమైన మాట ఏదీ ఇవ్వలేదని తెలుస్తోంది. త్వరలోనే శృతి హాసన్ స్పెషల్ సాంగ్ ఉంటుందా? ఉండదా? అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను నిఖిల్ తండ్రి కుమారస్వామి నిర్మిస్తున్నారు.