నా కుమారుడికి ఆ సినిమానే మొదట చూపిస్తాను – కాజల్ అగర్వాల్

Published on Mar 8, 2023 2:25 am IST


టాలీవుడ్ స్టార్ కథానాయికల్లో ఒకరైన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఎంతో సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. ఇటీవల కుమారుడు నీల్ కి జన్మనిచ్చిన కాజల్, ఎక్కువగా సమయాన్ని కుటుంబంతో అలానే కుమారుడితో గడుపుతూ ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక తాజగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఆమె మాట్లాడుతూ, తన కుమారుడు నీల్ కి ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు సినిమాలకు దూరంగా, అలానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి అందించకుండా పెంచాలనుకుంటున్నట్లు తెలిపారు.

అలానే అతడికి తొలిసారిగా విజయ్ హీరోగా తాను నటించిన తుపాకీ సినిమా చూపించాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. మురుగదాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీ రిలీజ్ తరువాత ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ ల ఇండియన్ 2, బాలకృష్ణ 108 తో పాటు మరికొన్ని సినిమాలు కాజల్ చేతిలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం :