కీర్తి 20 లో ప్రముఖ నటీనటులు !

మళయాల బ్యూటీ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం లో నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. నరేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ , నరేష్ , కమల్ కామరాజ్ ,నదియా, భాను శ్రీ మెహతా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ యూస్ ఎస్ వెళ్లనుంది. దాదాపుగా 40 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరుపనున్నారు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈచిత్రం తెలుగు తోపాటు తమిళంలోనూ విడుదలకానుంది.

Exit mobile version