రామ్ చరణ్ మూవీకి వర్క్ చేయనున్న స్టార్ కొరియోగ్రాఫర్

Published on Mar 7, 2023 11:55 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యువ సక్సెస్ఫుల్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియయేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దీనిని గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, మార్చి 18, 19న హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ కోసం వేసిన ఒక గ్రాండ్ సెట్టింగ్ లో ఒక భారీ సాంగ్ ని రామ్ చరణ్, కియారా అద్వానీ ల పై చిత్రీకరించనుండగా దీనికి స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మాస్టర్ వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. 1993లో శంకర్ తెరకెక్కించిన జెంటిల్ మ్యాన్ మూవీలోని చికుబుకు చికుబుకు రైలే సాంగ్ లో కనిపించి ఆకట్టుకున్నారు ప్రభుదేవా. భారీ పొలిటికల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది.

సంబంధిత సమాచారం :