
‘యమదొంగ’ సినిమాలో ఎన్.టి.ఆర్ చేత నాచోరే నాచోరే సాంగ్ కి థియేటర్ దద్దరిల్లిపోయేలా స్టెప్స్ వేయించి, ఆ ఒక్క సినిమాతో స్టార్ కొరియోగ్రాఫర్స్ లీగ్ లో చేరిపోయిన డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్. ఇన్ని రోజులు టాలీవుడ్ లోని అందరి స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకూ అందరికీ డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోవడానికి సిద్దమయ్యాడు. టెక్నీషియన్ లేదా యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత డైరెక్టర్ అవ్వడం సినీ ఇండస్ట్రీలో సర్వ సాధారణంగా జరిగే విషయం. ఇప్పుడు అదే బాటలో ప్రేమ్ రక్షిత్ కూడా అడుగేస్తున్నాడు. దానికి తగగా కథని కూడా సిద్దం చేసుకున్నాడు.
కథని మాత్రమే కాదు కథానాయకుడిని కూడా ఫైనల్ చేసుకున్నాడు. అతనెవరో కాదు ఇటీవల వచ్చిన బాహుబలి సినిమాతో ఇండియా మొత్తం భళ్ళాలదేవుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి. ప్రేమ్ రక్షిత్ రానా కోసం ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కథని సిద్దం చేసాడు, దాన్ని రానాకి చెప్పడం, రానా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయాయి. సురేష్ బాబు నిర్మించనున్న ఈ సినిమాలో రానా సరసన రెజీన కసాండ్ర ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. అలాగే మరో నెల రోజుల్లో ఈ సినిమాని స్టార్ట్ చేసి కంటిన్యూగా మూడు నెలల్లో షూట్ మొత్తాన్ని ఫినిష్ చేసి వచ్చే ఏడాది మొదట్లో సినిమాని రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. మరి ఇప్పటి వరకూ తన డాన్స్ లతో మెప్పించిన ప్రేమ్ రక్షిత్ డైరెక్టర్ గా ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి.