ప్రాణహాని ఉందంటూ పిర్యాదు చేసిన ఒకప్పటి స్టార్ కమెడియన్ !


ఒకప్పటి స్టార్ కమెడియన్ వేణు మాధవ్ తనకు ప్రాణహాని ఉందంటూ కర్నూలు పోలీసులకు పిర్యాదు చేశారు . నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా టీడీపీ తరపున ప్రచారం చేసిన వేణు మాధవ్ ప్రతి పక్ష వైసీపీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నైపథ్యంలో తనకు వివదిహ ఫోన్ నెంబర్ల నుండి కాల్స్ వస్తున్నాయని, చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన కర్నూలు రెండవ పట్టణ సిఐకు ఇచ్చిన ఫిర్యాదులో పాల్గొన్నారు.

అంతేగాక తాను ఎవరినైతే విమర్శించానో వాళ్ళు తన వద్దకు వచ్చి మాట్లాడాలని అంతేగాని ఇలా అనేక నెంబర్ల నుండి ఫోన్స్ చేస్తుంటే తానెలా తట్టుకోవాలని అన్నారు. కాబట్టి దయచేసి తనని బెదిరిస్తున్నవారు తమ టైమ్ వృధా చేసుకుని తన సమయం చేయవద్దని హితవు పలికారు.