ప్రభాస్ ‘సలార్’ లో ఆ స్టార్ కమెడియన్ ఫుల్ లెంగ్త్ రోల్ ….??

Published on Jun 29, 2022 2:00 am IST

రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి భువన గౌడ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తుండగా రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రారంభం నాటి నుండి అందరిలో సూపర్ గా హైప్ క్రియేట్ చేసిన సలార్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్ ఈ మూవీలో ఇప్పటివరకు పోషించని పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారని, రిలీజ్ తరువాత మూవీ పెద్ద సక్సెస్ కొట్టడంతో పాటు ఆయన పాత్ర కూడా అందరికీ ఎంతో గుర్తుండిపోతుందని అంటోంది యూనిట్.

అయితే ఈ మూవీ యొక్క లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో ప్రముఖ స్టార్ కమెడియన్ సప్తిగిరి ఇందులో ఒకింత ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారని, అలానే ఈ మూవీ కోసం ఆయన 30 రోజుల కాల్షీట్స్ కేటాయించారని అంటున్నారు. సినిమాలో భారీ మాస్ యాక్షన్ సీన్స్ తో పాటు ఆకట్టుకునే కామెడీ సీన్స్ కూడా ఆడియన్స్ ని అలరిస్తాయని సమాచారం. అయితే దీనిపై సలార్ యూనిట్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

సంబంధిత సమాచారం :