నాగ చైతన్య సినిమాలో స్టార్ కమెడియన్ !
Published on Jul 16, 2017 2:41 pm IST


అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు కృష్ణ ఆర్వి మరిముత్తు డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి విదితమే. కొద్దిరోజుల క్రితమే ఈ చిత్రానికి ‘యుద్ధం శరణం’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను నిర్ణయించారు. ఈ చిత్రంలో స్టార్ కమెడియన్ ప్రియదర్శి కూడా నటించనుండటం విశేషం. మొదటి చిత్రం ‘పెళ్లి చూపులు’ తో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి ఈ సినిమాలో కూడా మంచి ఫన్ ఉన్న పాత్ర చేస్తున్నాడని, అతని పాత్రలో మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని తెలుస్తోంది.

షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగష్టు 24న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వారాహి చలన చిత్రం నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ భాద్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ సినిమాతో నాగ చైతన్య మాస్ ఆడియన్సుకు మరింత దగ్గరవుతారని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

 
Like us on Facebook