సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా సెట్స్ లో గాయపడ్డ స్టార్ కమెడియన్

5th, September 2016 - 02:20:07 PM

prudhvi-raj
సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు గోపి చాంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వి గాయపడ్డారు. ఓ కామెడీ సీక్వెన్స్ లో రోప్ స్టంట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పృథ్వి కి చిన్న చిన్న గాయాలయ్యాయి. దీంతో టీమ్ ఆయన్ను దగ్గర్లో ఉన్న ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చేర్పించింది.

ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. తన ఆరోగ్యం బాగానేఉందని, కంగారు పడవద్దని ఆయన అభిమానులకు తెలిపారు. తన పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో పృథ్వి కొంతకాలంగా పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. ఇక ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ మెయిన్ లీడ్ గా చేస్తోంది.