త్రివిక్రమ్, ఎన్టీఆర్ ల సినిమాలో నటించనున్న కమెడియన్ కమ్ హీరో !
Published on Nov 22, 2017 11:34 am IST

స్టార్ కమెడియన్ మంచి స్థాయిలో ఉండగానే హీరోగా మారిన నటుడు సునీల్ మొదట్లో హీరోగా మంచి సక్సెస్ లు అందుకున్నప్పటికీ ఈ మధ్య సరైన విజయాలు లేకపోవడంతో మళ్ళీ తనకు కలిసొచ్చిన కామెడీ ట్రాక్లోకే రావాలనుకుంటున్నారు. అందుకే ఆయన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో చేయనున్న చిత్రంలో సునీల్ కోసం ఒక మంచి పాత్రను సిద్ధం చేస్తున్నారట.

ఆ పాత్ర ఎన్టీఆర్ స్నేహితుడిగా సినిమా మొత్తం కనిపిస్తుందని, అందులో మంచి ఫన్ ఉంటుందని తెలుస్తోంది. గతంలో కూడా త్రివిక్రమ్ సునీల్ కోసం ఎన్నో మర్చిపోలేని కామెడీ పాత్రల్ని రాసిన సంగతి తెలిసిందే. ఇకపోతే త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ తో చేస్తున్న సినిమా పూర్తవ్వగానే ఈ సినిమా మొదలుకానుంది.

 
Like us on Facebook