కేజీఎఫ్ 2 పై స్టార్ డైరక్టర్ ప్రశంసల వర్షం!

Published on Apr 19, 2022 12:07 pm IST

కేజీఎఫ్ 2 చిత్రం థియేటర్ల లో విడుదల అయినప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను రాబడుతోంది. చాలా మంది ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిత్రం లో నటించిన నటీనటుల పై, టీమ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పై ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించిన తాజా సెలబ్రిటీ.

KGF 2 చాలా అద్భుతంగా ఉంది. సాంకేతికంగా ప్రతి అంశంలో చాలా బాగా చేశారు అని, స్టంట్స్ మైండ్ బ్లోయింగ్, రాకీ భాయ్‌గా యష్ ఒక కల్ట్. ప్రశాంత్ నీల్, హోంబలే ఫిల్మ్స్ మరియు తెరపై ఈ మాయా ప్రపంచాన్ని సృష్టించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రవీనా టాండన్ మరియు సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ బిగ్గీలో ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ కూడా భాగమయ్యారు.

సంబంధిత సమాచారం :