‘స్పిరిట్’లో ఛాన్స్ అడిగిన స్టార్ డైరెక్టర్

‘స్పిరిట్’లో ఛాన్స్ అడిగిన స్టార్ డైరెక్టర్

Published on Jan 27, 2025 10:01 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఐతే, ‘స్పిరిట్’ సినిమాలో నటించే అవకాశం ఇవ్వమని సందీప్ రెడ్డి వంగాను తాను అడిగినట్లు అనిల్ రావిపూడి చెప్పారు. అయితే సందీప్ రెడ్డి వంగా మాత్రం అనిల్ రిక్వెస్ట్ కి నవ్వుతూ ‘మీరు మాకు దొరకరు. సినిమా తర్వాత సినిమా చేస్తావు. యాక్టింగ్ చేసే గ్యాప్ ఇచ్చుకుంటావా ?’ అని అన్నారట. ఈ విషయాన్ని కూడా అనిల్ రావిపూడి తెలిపారు.

అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా సినిమాల గురించి కూడా కామెంట్స్ చేస్తూ.. ‘నేను సందీప్‌లా సినిమాలు తీయలేను. అదేవిధంగా నాలా సందీప్ రెడ్డి వంగా కూడా సినిమాలు తీయలేడు’ అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఇక స్పిరిట్ సినిమా విషయానికి వస్తే..ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని తెలుస్తోంది. అన్నట్టు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమా కోసం ఇప్పటికే సాంగ్స్ ను కంపోజ్ చేయడం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు